విమానం కూలింది ఇండియాకు కాదు, ఇండియానాకు వెళ్తుండగా..  - MicTv.in - Telugu News
mictv telugu

విమానం కూలింది ఇండియాకు కాదు, ఇండియానాకు వెళ్తుండగా.. 

June 6, 2020

India Indiana telugu media misstate in plane crash

చిన్నపొరపాటు మొత్తం విషయాన్ని మార్చేస్తాయి. హడావుడిలో కొన్ని వార్తలు పట్టుతప్పి తల బొప్పికట్టిస్తాయి. ‘అమెరికా నుంచి భారత్‌కు బయల్దేరిన చిన్న విమానం కుప్పకూలి పైలట్ సహా ఐదుగురు చనిపోయారు..’ అని ఈ రోజు తెలుగు మీడియా వార్తలు హల్ చల్ చేశాయి. చిన్న విమానం అని చెబుతూనే ఈ  వార్త అందించారు. సాధారణంగా ఐదుగురు మాత్రమే ప్రయాణిండానికి వీలుండే విమానాలు వేల కిలోమీటర్లు.. ఖండాలు.. సముద్రాలు దాటి ప్రయాణించవు. నిజానికి ఆ విమానం అమెరికాలోని ఇండియానాకు వెళ్తోంది. అయితే దాన్ని ఇండియా అనుకుని పొరపడింది తెలుగు మీడియా.  

ఫ్లోరిడాకు చెందిన ఓ కుటుంబం ఇండియానాలో జరిగే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పీఏ-31టీ అనే చిన్న విమానంలో శుక్రవారం వెళ్లింది. ఉత్తర జార్జియాలోని లేక్ ఒకోనీ వద్ద కుప్పకూలింది. పైలట్ నహా అందరూ చనిపోయారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మృతులను లారీ రే ప్రూయిట్(67), షాన్ చార్లెస్ లామోంట్(41), జోడీ రే లామోంట్(43), వారి పిల్లలు జాయిస్, ఎలైస్‌గా గుర్తించారు.