India is ready to fight with newzland
mictv telugu

కివీస్‌‌తో పోరుకు భారత్ సిద్ధం..వారికి ప్లేస్ కష్టమే..

November 17, 2022

టీ 20 వరల్డ్ కప్ ముగిసిపోయింది. ఇక దైపాక్షిక సిరీస్‌లకు జట్లు రెఢీ అయ్యాయి. న్యూజిలాండ్‌ను భారత్ ఢీ కొట్టనుంది. వారి దేశంలోనే మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనుంది. ఈ సీరిస్‌కు టీం ఇండియా సీనియర్లు దూరంగా ఉన్నారు.కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సీనియర్ బౌలర్లు మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ దూరంగా ఉండగా.. టీ20ల్లో హార్దిక్ పాండ్యా, వన్డేల్లో శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నారు.ఈ సిరీస్‌లో గెలిచి వరల్డ్ కప్ ఓటమిని మరిచిపోయేటట్లు చేయాలని భావిస్తున్నారు. సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 శుక్రవారం వెలింగ్టన్ వేదికగా జరగనుంది.

మొదటి టీ20కి జట్టును ఎంపిక చేయడం మేనేజ్ మెంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఒక్కో ప్లేస్‎కు ఇద్దరేసి పోటీ పడుతుండడంతో తలనొప్పి మొదలైంది. ప్రధానంగా ఓపెనింగ్‌కు ఎవరు రానున్నారన్నదానిపై సస్పెన్షన్ నెలకొంది. ప్రపంచకప్ వైఫల్యం అనంతరం పంత్‌ను ఓపెనర్ గా పంపాలని సూచనలు రావడంతో ఈ సిరీస్‌లో అతనిని పరిక్షించే అవకాశం ఉంది. జట్టులో శుభమన్ గిల్‌కు స్థానం ఫిక్స్ కాగా అతనికి తోడుగా ఇషాన్, పంత్‌లో ఒకరు ఆడే అవకాశం ఉంది. మూడు, నాలుగు స్థానాల్లో సంజూశాంసన్, సూర్యకుమార్ యాదవ్ ఉండగా..ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడాలో ఒకరికే అవకాశం లభించనుంది. ఆరోస్థానంలో హార్దిక్ పాండ్యా రానున్నాడు. ఇషాన్ కిషాన్, పంత్ ఇద్దరు జట్టులో ఉంటే సంజూశాంసన్ స్థానం కోల్పోయే ఛాన్స్ ఉంది.

బౌలర్ల విషయంలోనూ తీవ్ర పోటీ నెలకొంది. పేసర్ల కోటాలో భువనేశ్వర్ కుమార్,అర్షదీప్ స్థానాలు ఫిక్స్ అవ్వగా..ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ మధ్య పోటీ ఉంది.స్పిన్ విషయంలో చాహల్‌కే అవకాశాలు ఎక్కవ ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌కు చోటు కష్టమే..

తుదిజట్టు అంచనా : శుభమన్ గిల్, ఇషాన్ కిషాన్, సంజూ శాంసన్/శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్,అర్షదీప్ సింగ్,ఉమ్రాన్ మాలిక్/సిరాజ్, చాహల్