మొదటి రెండో వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న జోష్‌లో మూడో వన్డేలోనూ భారత్ ఓపెనర్లు దంచికొడుతున్నారు. రోహిత్ ,గిల్ జోడి న్యూజిలాండ్ బౌలర్లను చితక్కొడుతుంది. బ్యాటింగ్ అనుకూలించే పిచ్‌పై పోటీ పడుతూ బౌండరీలు బాదుతున్నారు.ఇద్దరూ మెరుపు అర్థసెంచరీలు సాధించి శతకాలువైపు దూసుకెళ్తున్నారు. వీరికి దూకుడుకు భారత్ 22 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 180 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 70 బంతుల్లో92 పరుగులు చేయగా, శుభమన్ గిల్ 62 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. వీరి ధాటికి న్యూజిలాండ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.