Statue of goddes mahalakshmi with open eyes in Kadiyapulanka
mictv telugu

భారత్-కివీస్ టీ20కి వర్షం అంతరాయం

November 22, 2022

India-Kiwis 3rd T20 stop due to rain

నేపియర్లో భారత్-కివీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20కి వర్షం అంతరాయం కలిగించింది. ఇండియా 9 ఓవర్లలో 75/4 స్కోరు చేసిన సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. ప్రస్తుతం క్రీ‌జ్‌లో హార్దిక్ పాండ్య (30),దీపక్ హుడా(9) పరుగులతో ఉన్నారు. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొందరగానే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ కిషన్(10), పంత్ (11) శ్రేయస్ అయ్యర్ (0) తోపాటు లాస్ట్ మ్యాచ్ హీర్ సూర్యకుమార్ యాదవ్(13) కూడా విఫలమయ్యారు.

అంతకుముందు న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. . ఓపెనర్ డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) అర్ధసెంచరీలతో రాణించినా, ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు.ఓ దశలో 2 వికెట్లకు 130 పరుగులతో పటిష్ఠంగా ఉన్న కివీస్‌ను సిరాజ్, అర్షదీప్ దెబ్బకొట్టారు. ఇద్దరు నాలుగేసి చొప్పున వికెట్లు తీసి రాణించారు.