India-Kiwis second T20 is also a dought
mictv telugu

భారత్-కివీస్ రెండో టీ20 కూడా డౌటే…

November 19, 2022

న్యూజిలాండ్ -భారత్ మూడు టీ20 సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన మొదటి టీ20 రద్దైంది. భారీ వర్షం కురవడంతో టాస్ వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇక రెండో టీ20 ఆదివారం మౌంగనుయ్ లోని బే ఓవల్ లో జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌పై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతవారణ శాఖ తెలిపింది. మ్యాచ్ సమయానికి ఆకాశం పూర్తిగా మేఘావృతం అయ్యి ఉంటుందని, 90 శాతం వర్షం కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. భారత్ ఆటగాళ్లు మాత్రం మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు. సీనియర్లు రెస్ట్ తీసుకోవడంతో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో సీనియర్లను పక్కనబెట్టి టీ20లో యువకులకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.ఈ తరుణంలో జట్టులోకి రావాలని తహతహలాడుతున్న యువకులకు ఈ సిరీస్ కీలకం కానుంది. కాగా ఈ సిరీస్ లో భారత్ 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. టీ20 లకు హార్దిక్ పాండ్య, వన్డేలకు శిఖర్ ధావన్ కెపెన్స్‌గా వ్యవహరిస్తున్నాడు.