రైతులకు శుభవార్త .. - MicTv.in - Telugu News
mictv telugu

రైతులకు శుభవార్త ..

April 16, 2019

గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు సరిగ్గా పడకపోవడంతో రైతులు ఎన్నో నష్టాల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు భారత వాతావరణ విభాగం శుభవార్త తెలిపింది. ఈ వార్షిక ఏడాది వర్షపాతం సాధారణానికి సమీపంలో ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సందర్భంగా భారత వాతావరణ విభాగం తొలిసారి నియర్ నార్మల్ (సాధారణ వర్షపాతానికి సమీపం) అనే పదాన్ని ఉపయోగించడం విశేషం. ఎల్‌పీఏలో 96 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అయితే, తొలి విడత వర్ష సూచనలో బహుశా 39 శాతం మాత్రమే సాధారణానికి సమీపంలో వర్షంపాతం ఉండే అవకాశం ఉందని తెలిపింది.

India likely to get normal southwest monsoon in 2019, says weather department.

నైరుతి రుతుపవనాల ఆధారంగా కురిసే వర్షం సాధారణ వర్షపాతానికి సమీపంలో ఉండే అవకాశం ఉందని వాతావరణ విభాగం పేర్కొంది. అయితే, మొత్తంగా జూన్-సెప్టెంబరు మధ్య 96 శాతం వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. దీనికి 5శాతం అటూఇటుగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సెక్రటరీ ఎం.రాజీవన్ తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసారైనా సకాలంలో వర్షాలు పడితే చాలని కోరుకుంటున్నారు.