బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ భారత్ కోల్పోయింది. వరుసగా రెండు మ్యాచులు ఓడిపోయి పరాభవం మూటగట్టుకుంది. బుధవారం జరిగిన రెండో వన్డేలో 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ గెలిచింది. చివర్లో వచ్చిన రోహిత్ శర్మ (28 బంతుల్లో 51) భారీ మెరుపులు మెరిపించినా ఓటమి తప్పలేదు. చివరి బంతికి 6 పరుగులు అవసరమవగా.. గాయాలైన రోహిత్ శర్మ ఆఖరి బంతిని సిక్స్ గామలచలేకపోయాడు. మొత్తానికి టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు మాత్రమే చేసింది.
అంతకుముందు ఓపెనర్లు విఫలమవగా శ్రేయాస్ అయ్యర్ 82, అక్షర్ పటేల్ అర్ధ సెంచరీలతో రాణించారు. మిగతా వారు చేతులెత్తేయడంతో రోహిత్ శర్మ వచ్చేదాకా కనీసం పోటీ ఇచ్చేవారు కరువయ్యారు. బంగ్లా బౌలర్లలో ఎబడోట్ హుస్సేన్ 3, మెహిదీ హసన్, షకీబ్ అల్ హసన్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్ ఫలితంతో బంగ్లాదేశ్ జట్టు మూడు వన్డేల సిరీస్ ను 2-0 తో కైవసం చేసుకుంది. అంతకు ముందు బౌలింగ్ చేసిన భారత్.. ముందు బంగ్లా పులులను తొలుత కట్టడి చేసినా తర్వాత చేతులెత్తేయడంతో వందలోపు ఆలౌట్ అవుతుందనుకున్న బంగ్లా జట్టు 50 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 271 పరుగులు చేసింది. ఏడో వికెట్ కి మహ్మదుల్లా (77), మెహిదీ హసన్ (100) మెరుపు సెంచరీతో రాణించారు. వీరిద్దరూ ఏడో వికెట్ కి 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా భారత్ పై 17 ఏళ్ల తర్వాత అత్యధిక పరుగలు చేసిన జోడిగా నిలిచారు.