భారతదేశంలోనే ఇక ఉంటానని అంటున్నారు బౌద్ధగురువు దలైలామా. ది సరైన ప్రదేశమని ప్రముఖ బౌద్ధ మత గురువు దలైలామా ప్రకటించారు. తాను చైనాకు వెళ్లబోనని, భారత్‌లోనే ఉంటానని ఆయన చెప్పారు. అలాగే, తన ఆరోగ్యం బాగానే ఉందని కాకపోతే చేతి నొప్పి కొద్దిగా ఉందని తెలిపారు. బౌద్ధుల 14వ గురువైన దలైలామా 1959 నుంచి భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. గత ఆరు దశాబ్దాలకుపైగా హిమాచల్‌లోని ధర్మశాలలో ఉంటున్నారు.
ఇక డిసెంబర్ 9న భారత్, చైనాల మధ్య జరిగిన తవాంగ్ ఘర్షణ గురించి దలైలామాను అడగ్గా….సాధారణంగా చెప్పాలంటే ఐరోపా, ఆఫ్రికాతో సహా ఆసియాలో కూడా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి అనుకుంటున్నాను అని అన్నారు. ప్రస్తుతం చైనా కూడా మరింత సరళంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
ప్రేమజంటను చేరదీసిన వైసీపీ ఎమ్మెల్యే.. పార్టీ ఆఫీసులో పెళ్లి
బీఆర్ఎస్లో ముసలం.. మల్లారెడ్డిపై ఎమ్మెల్యేల గుస్సా