పొరుగు దేశం చైనా అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోంది. పెన్సిల్ ముక్క నుంచి ఫోన్ల వరకు, పతంగుల నుంచి ఉపగ్రహాల వరకు సర్వం మేడిన్ చైనానే. అమెరికా, బ్రిటన్, జర్మనీ తదితర దేశాలను కూడా తలదన్నుతూ ప్రొడక్షన్లో దూసుకెళ్తున్న డ్రాగన్ కంట్రీ కార్ల ఉత్పత్తితో, కార్ల వాడకంలోనూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ విషయంలో మనదేశాన్ని, చైనాతో పోలుస్తూ ఆటో రంగ దిగ్గజం, మారుతి కంపెనీ చైర్మర్ ఆర్ సీ భార్గవ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
‘మనదేశంలో ప్ర్రతి వెయ్యిమందికి 30 కార్లు మాత్రమే ఉన్నాయి. చైనాలో 170 కార్లు ఉన్నాయి. భారత్ చైనాతో సమానం కావాలంటే మరో 140 ఏళ్లు పడుతుంది. దీనికి కారణం మనదేశంలో ఆటో పరిశ్రమకు ప్రోత్సాహం లేకపోవడమే. సోషలిస్టు ధోరణిలో కార్లపై ఎక్కువ పన్నులు వేయడం పద్ధతి కాదు. ప్రభుత్వ విధానాలు సరిగ్గా లేకపోవడంతో మన దేశంలో వాహన పరిశ్రమ ఎదగడం లేదు. గత దశాబ్దంతో పోలిస్తే అభివృద్ధి రేటు 12 శాతం నుంచి దారుణంగా 3 శాతానికి పడిపోయింది. కార్లపై 28 నుంచి 50 శాతం వరకు ఉన్న పన్ను భారంగా మారింది. కర్బన ఉద్గారాలు, భద్రతా చర్యలు పేరుతో తీసుకుంటున్న విధానాలు కాళ్లకు బంధం వేస్తున్నాయి’’ అని భార్గవ చెప్పుకొచ్చారు.