ముంబై వాంఖడే స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచులో భారత్ విజయం దిశగా సాగుతోంది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన భారత్ 162 పరుగులు చేయగా, అనంతరం బరిలోకి దిగిన లంక జట్టు తడబడుతూ ఆడుతోంది. కుశాల్ మెండిస్ 28, పరుగులు చేయగా మిగతా వారు ఆ మాత్రం కూడా ఆడలేకపోయారు. ఇప్పుడు లంక స్కోరు 13 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 30 పరుగులుగా ఉంది. ఐదు వికెట్లు కోల్పోయి అపపోపాలు పడుతోంది. శివంమావి 2, ఉమ్రాన్ మాలిక్ 1, హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశారు. క్రీజులో హసరంగ 6, శనక 23 పరుగులతో ఉన్నారు. లంక విజయం సాధించాలంటే 43 బంతుల్లో 73 పరుగులు అవసరం.