భారత్‌×పాక్‌ మ్యాచ్ టీజర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌×పాక్‌ మ్యాచ్ టీజర్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

May 19, 2017

భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఉందంటే ఆ క్రికెట్ కిక్కే వేరు. దాయాది ఫైట్ కు సంబంధించిన అన్ని అంశాలను అభిమానులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. మ్యాచ్‌ ప్రచార వీడియోలకు హెవీ రెస్పాన్స్ వస్తోంది. గత రెండు ప్రపంచకప్‌లకు విడుదలైన ‘మోకా.. మోకా’ సిరీస్‌ వీడియోలు భారత్‌లో బిగ్ హిట్‌ అయ్యాయి. ఇక జూన్‌ 4న ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, పాక్‌ మ్యాచ్‌ సందర్భంగా స్టార్‌స్పోర్ట్స్‌ రూపొందించిన ప్రచార చిత్రం కట్టిపడేస్తోంది.
ప్రచార చిత్రం కథనం ఇలా ఉంది. కోటీశ్వరుడైన ఓ యువకుడు బౌద్ధ సన్యాసిగా మారాలనుకుంటాడు. తన భవంతి, కారు, బోటు, వ్యాపారం, ఆస్తిపాస్తులు అన్నీ వదిలేస్తాడు. ఇక గురువు దగ్గరకు వెళ్లిన తర్వాత కటింగ్ చేసేందుకు తలపై కత్తి పెడుతుండగా అతడికి జూన్‌ 4న మ్యాచ్‌ ఉన్న విషయం పేపర్‌ ప్రకటనలో కనిపిస్తుంది. అప్పుడు ఆ యువకుడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే…