భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ లవర్స్ ఊగిపోతారు. వాళ్ల ఎక్స్ ఫెక్టేషన్స్ హై రేంజ్ లో ఉంటాయి. బాల్ టు బాల్.. నెక్ టు నెక్ ఫైట్..థ్రిల్లూ ఉండాలనుకుంటారు..కానీ ఆదివారం మ్యాచ్ లో అంతా మజా లేకుండానే ముగిసింది. అభిమానులకు థ్రిల్ లేకుండా పోయింది. కాస్తో కూస్తో టీమిండియా ఫ్యాన్స్ కోహ్లీ , రోహిత్ , ధావన్ బ్యాటింగ్ లతో నైనా ఎంజాయ్ చేశారు. పాకిస్థాన్ వాసులకు అదీ కూడా లేదు.పరమ చెత్తగా ఆడి ఆ దేశ పరువును తీశారు. ఆట అంటే.. అందులో దాయాదుల ఆట అంటే..ఎలా ఉండాలే..కానీ మరి ఇంత చెత్తగా ఉంటుందా… గల్లీ క్రికెట్ కన్నా దారుణం అంటూ క్రికెట్ లవర్స్ వాపోతున్నారు.
భారత్ -పాక్ మ్యాచ్ కోసం రోజుల తరబడి ఎదురుచూశారు. మ్యాచ్ జరిగే రోజంతా ఒక్కటే హడావుడి..తీరా మజా లేని మ్యాచ్ తో పాకిస్థానీ క్రికెటర్లు పిచ్చిలేపారు. థూ ఇలా పరమ చెత్తగా ఆడారేంట్రా బాబు..పాకిస్థానోళ్లు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు అంటూ డిజాపాయింట్ అయ్యారు. ఆటలో గెలుపోటములు సహజమే అయినా కనీస పోటీ ఇవ్వకపోవడం దారుణమంటున్నారు. అంత కోసం ఎందుకు ఆడాలో..అని విరుచుకుపడుతున్నారు. పాకిస్థాన్ ప్లేయర్లపై మనోళ్లే ఈ రేంజ్ లో గుస్సా అవుతుంటే…పాకిస్థానోళ్లు ఏ రేంజ్ లో గుస్సా అవ్వాలి…
ఇండియా చేతిలో దారుణంగా ఓడిన పాకిస్థాన్‌పై ఆ టీమ్ మాజీలు ఫైరవుతున్నారు. ఇంత చెత్త ఆట ఎప్పుడూ చూడలేదని, పాకిస్థాన్ టీమ్ పాతాళానికి దిగజారిందని ఇమ్రాన్‌ఖాన్, అఫ్రిదిలు అంటున్నారు. పాక్ క్రికెట్‌ను సమూల ప్రక్షాళన చేస్తేగానీ ఇండియన్ టీమ్ దరిదాపుల్లోకి రాదని వాళ్లు స్పష్టంచేస్తున్నారు. ఆటలో గెలుపోటముల సహజమే కానీ.. కనీసం పోరాడకుండా చేతులెత్తేయడమే బాధగా ఉందని ఇమ్రాన్ అన్నాడు. పీసీబీ చైర్మన్‌ను ప్రొఫెషనల్‌గా ఎంపిక చేస్తేనే పాక్ టీమ్‌లో మార్పు సాధ్యమవుతుందని అంటున్నారు.పాకిస్థాన్ క్రికెట్లర్లు…కనిపిస్తే కొట్టేంత రేంజ్ లో ఆ దేశవాసులు శివాలెత్తుతున్నారు. ఎంతైనా భారత్ తో ఆట అంటే ఓ రేంజ్ లోనైనా పోటీ ఇవ్వాలి… ఫ్యాన్స్ , ఆడియన్స్ ఎక్స్ ఫెక్టేషన్స్ తలకిందులు చేశారు. ఇంకోసారి ఇలా చేయొద్దంటున్నారు. బెటర్ లక్ నెక్ట్స్ టైమ్ అనికూడా అంటున్నారు. చూడాలి ముందు ముందు కనీస పోటీ ఎలా ఇస్తారో…
tags INDIA-Pakisthan Match/No Thirll/Pak ex cricketers Fire