ముందే మ్యాచ్ ఫిక్స్..! - MicTv.in - Telugu News
mictv telugu

ముందే మ్యాచ్ ఫిక్స్..!

June 19, 2017

చెత్త బౌలింగ్‌, పసలేని బ్యాటింగ్, ఫీల్డింగ్‌ వైఫల్యాలు…. కనీస పోరాట పటిమ చూపలేదు. ముందే చేతులెత్తేశారు. ఇప్పుడు ఇదే అభిమానులకు తిక్క రేపుతోంది. గెలుపొటములు కామన్ అయినా మరి ఇంత చెత్తగా ఓడిపోవడం…అదీ దాయాది పాకిస్తాన్ చేతిలో…అందుకే ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. రెండు, మూడు రోజుల ముందు నుంచే ఆల్ ది బెస్ట్ చెబుతూ వచ్చిన వాళ్లు..క్రికెటర్లు కనిపిస్తే దుమ్ముదులిపేంతా రేంజ్ లో రగిలిపోతున్నారు.అవును వాళ్ల కోపంలో అర్థం ఉంది. ఆటను ఎలా ఆడాలి. ఓడితే ఒడొచ్చు కానీ మరి ఇలానా…గల్లీ క్రికెట్ లా ఆడి పరువు తీశారు. భువి, పాండ్యా తప్ప మిగతా అందరూ జీరోలే.ఎందుకిలా ఆడారు…?భారీ టార్గెటే కొంప ముంచిందా…?ముందే మ్యాచ్ ఫిక్స్ అయిందా..?

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ ఘోర పరాజయం పాలైంది. పాకిస్థాన్ తొలిసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 339 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఫైనల్ లో 30.3 ఓవర్లలోనే ఆలౌటై పిచ్ నుంచి వెనుదిరిగింది. పాకిస్థాన్ చేతిలో 180 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. శిఖర్ ధవన్-21, కోహ్లీ-5 , యువరాజ్ సింగ్ 22, ఎంఎస్ ధోనీ -4, జడేజా-15 పరుగులతోనే సరిపెట్టుకోగా..పాండ్యా 76 పరుగులతో పరువు నిలబెట్టాడు. పాండ్యా తప్ప మిగతా వారు పరమచెత్తగా ఆడారు. వికెట్లు టపటపా పడుతోన్న సోయి లేదు. వచ్చీ రావడంతోనే వీరలెవల్లో రెండు ఊపులు బ్లైండ్ గా ఊపి గల్లీ క్రికెట్ ఆడారు. అందరూ ఇలాగే ఆడారు. ఫైనల్ ఆడాల్సిన తీరు ఇదా…ఎంత బాధ్యతగా బ్యాటింగ్ చేయాలి. టోర్నీలో పడిలేస్తున్న పాక్ కు చుక్కులు చూపించాల్సింది పోయి చేతులెత్తేస్తారా..?

కనిపిస్తే కొట్టేంతాలో ఫ్యాన్స్ ఫైర్…

దాయాదుల సమరంలో పోరాడకుండానే కోహ్లి సేన సులువుగా లొంగిపోయింది.దీంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. టీవీలు పగిలాయి.. పోస్టర్లు దగ్థమయ్యాయి.మ్యాచ్‌ ముగిసిన వెంటనే టీమిండియా ఫ్యాన్స్‌ తమ కోపాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి కోహ్లి సేనకు వ్యతిరేకంగా నినదించారు. అహ్మదాబాద్‌లో కొంత మంది టీవీలు రోడ్డు మీదకు తెచ్చి బద్దలు కొట్టారు. భారత క్రికెటర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాన్పూర్‌లో కెప్టెన్‌ కోహ్లి, అశ్విన్‌, యువరాజ్‌ సింగ్‌, ఇతర ఆటగాళ్ల పోస్టర్లను కాల్చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో క్రికెట్‌ ప్రేమికుల ఆగ్రహానికి టీవీలు పగిలిపోయాయి. టీమిండియా సభ్యుల ఆటతీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.రాళ్లదాడి, అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్తగా రాంచిలోని మహేంద్ర సింగ్‌ ధోని ఇంటి దగ్గర భద్రతను పెంచారు. మిగతా ఆటగాళ్ల నివాసాల దగ్గర కూడా టైట్ సెక్యూరిటీ పెట్టారు.

ఓటమికి ఐదు కారణాలు…

కోహ్లిసేన ఆట తీరులో అన్ని విభాగాల్లో లోపాలు ఉన్నాయి. ప్రధానంగా ఐదు అంశాలు టీమిండియా ఓటమికి కారణలయ్యాయి.

* టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నందుకు కోహ్లి మూల్యం చెల్లించుకున్నాడు.

*టాస్‌ ఓడిపోవడం పాకిస్తాన్‌ టీమ్‌కు ప్లస్ అయింది. అయితే తాను టాస్‌ గెలిస్తే ఫీల్డింగ్‌ తీసుకుంటానని పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ చెప్పడం విశేషం.

*టాస్‌ గెలిస్తే పాకిస్తాన్‌కు ఫస్ట్‌ బ్యాటింగ్‌ ఇవ్వొద్దని మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ ఖాన్‌ ఎందుకు చెప్పాడో భారత్ కు తెలిసొచ్చివుంటుంది.

* భారత బౌలర్ల నిర్లక్ష్యపు బౌలింగ్ నిలువునా ముంచింది. సెంచరీ వీరుడు ఫకార్ జమాన్ ను 3 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అవుట్‌ చేసే అవకాశాన్ని బుమ్రా కాలదన్నాడు. నోబాల్‌ వేసి అతడి సెంచరీకి కారణమయ్యాడు.

*ఇలా లైఫ్ దొరికిన ఫకార్ జమాన్ తొలి వన్డే లోసెంచరీతో చెలరేగాడు.మన వాళ్లు తిడుతున్నారు..అక్కడోళ్లు పొగుడుతున్నారు…

పరువుతీసిన కోహ్లీ సేన ను అభిమానులు తిట్టనితిట్టు తిడుతున్నారు. ట్విటర్ లో ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు. కనిపిస్తే కొట్టేలా ఉన్నారు. కానీ పాకిస్థాన్ ఫ్యాన్స్ మాత్రం విరాట్ కోహ్లీని మెచ్చుకుంటున్నారు. మ్యాచ్ ఓడిన త‌ర్వాత విరాట్ మాట్లాడిన మాట‌లు అక్క‌డి ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేశాయి. ఇంతకీ కోహ్లీ ఏమన్నడంటే…‘పాక్ టీమ్‌కు శుభాకాంక్ష‌లు. వాళ్లు అద్భుతంగా ఆడారు. టోర్నీలో వాళ్లు ప‌డి లేచిన తీరు అద్భుతం. ఆ దేశంలో ఎంత టాలెంట్ ఉందో చెప్ప‌డానికి ఇదే నిద‌ర్శ‌నం. వాళ్ల‌దైన రోజున ఎలాంటి టీమ్‌నైనా మ‌ట్టిక‌రిపించే స‌త్తా ఉంద‌ని మ‌రోసారి నిరూపించారు అని…కోహ్లి మ్యాచ్ త‌ర్వాత అన్నాడు. కోహ్లి ప‌రిణ‌తితో చేసిన కామెంట్స్ పాక్ ఫ్యాన్స్ మ‌ది దోచుకున్నాయి. ట్విట్ట‌ర్‌లో వాళ్లు విరాట్‌ను తెగ మెచ్చుకుంటున్నారు.కానీ టీమిండియో ఫ్యాన్స్ ఉమ్మేస్తున్నారు.

టాస్ గెలిచి పాకిస్థాన్ కు బ్యాటింగ్ అప్పచెప్పడంతోనే భారత్ ఓటమి సగం ఫిక్స్ అయింది. పాక్ ఇచ్చిన భారీ టార్గెట్ చూశాక హాండ్రెడ్ పర్సెంట్ ఫిక్సయినట్టున్నారు ఓటమి తప్పదని..అందుకే లైట్ తీసుకున్నారేమో…చెత్తగా ఆడారు.పెవిలియన్ కు వెళ్లాక కూడా నవ్వుతూ కనిపించారు. ఎక్కడా వాళ్లలో సీరియస్ నెస్ కనిపించలేదు. ఇదేనేమో ఆటను ఆటగా చూడటమట్టే…మరి మన పిచ్చి కాకపోతే దేశంలో ఒక్క క్రికెట్ ఆటే ఉన్నట్టు..పట్టుకుని వేలాడుతున్నాం. ఇదే రోజు పాకిస్థాన్ పై విజయఢంకా మోగించిన భారత హాకీ టీమ్ ఎందుకు ప్రోత్సాహించలేకపోతున్నాం..క్రికెట్ లా హాకీ , బ్యాడ్మింటన్ ను ఎందుకు చూడలేకపోతున్నాం. ఇకనైనా క్రీడా అభిమానుల్లో మార్పు రావాలి. క్రికెట్ ఒక్కటే నమ్ముకుంటే కిక్కు ఉండదు..సో ..వీలైతే అన్ని ఆటలు క్రికెట్ లా చూడాలి. అప్పుడే ఆటల్లో అసలు సిసలైన మజా తెలుస్తుంది.