అగ్ని-5 ని మండిస్తే టోటల్ చైనా మటాష్..! - MicTv.in - Telugu News
mictv telugu

అగ్ని-5 ని మండిస్తే టోటల్ చైనా మటాష్..!

July 13, 2017

పక్కలో బల్లెం లా తయారైన చైనాను భారత్ చెడుగుడు ఆడాలనుకుంటుందా..? చైనా మొత్తాన్ని టార్గెట్ చేసేలా అగ్ని- 5 ని అభివృద్ధి చేయబోతుందా..? ఈ ఖండాంతర క్షిపణిని దక్షిణాది నుంచి ప్రయోగించినా చైనా మొత్తన్ని లక్ష్యంగా చేసుకోవచ్చా..? అవుననే అంటున్నారు అమెరికన్‌ అణ్వాయుధ నిపుణులు.

సిక్కిం సరిహద్దు వివాదంతో భారత్‌-చైనా నడుమ టెన్షన్ వాతావరణం నెలకొంది. డోక్లాం ప్రాంతం నుంచి భారత బలగాలు వెనక్కి వెళ్లాలంటూ చైనా వార్నింగ్ ఇస్తున్నా భారత్‌ వెనక్కి తగ్గడం లేదు. దీంతో ఇరుదేశాల మధ్య యుద్ధం తప్పదన్న రేంజ్ లో సిచ్యూయేషన్ ఉంది. ఒకవేల యుద్ధం వస్తే ఎవరి బలబలాలు ఏంటీ…ఎవరి అణుశక్తి ఏంటీ…వీటిపై నిపుణులు వారివారి వెర్షన్లు వినిపిస్తున్నారు. లేటెస్ట్ గా అమెరికాకు చెందిన హన్స్‌ ఎం క్రిస్టెన్సన్‌, రాబర్ట్‌ ఎస్‌ నోరిస్‌ అనే ఇద్దరు అణ్వాయుధ నిపుణులు.. ‘ఇండియన్‌ న్యూక్లియర్‌ ఫోర్స్‌ 2017’ పేరుతో ఆర్టికల్ రాశారు.‘ప్రస్తుతం భారత్‌ దగ్గర ఏడు అణు సామర్థ్య వ్యవస్థలు ఉన్నాయి.

అందులో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నాలుగు భూ ఉపరితల ఖండాంతర క్షిపణులు, ఒకటి సముద్ర ఉపరితల ఖండాంతర క్షిపణి. అయితే ప్రస్తుతం మరో నాలుగు వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. రానున్న దశాబ్ద కాలంలో వీటిని సిద్ధం చేయబోతోంది. ఇక అగ్ని-1ను ఆధునీకరించి అగ్ని-2తయారుచేసింది. ఇది 2వేల కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం కలది. అంటే దీంతో చైనాలోని పశ్చిమ, దక్షిణ, మధ్య భూభాగాలను టార్గెట్ చేయొచ్చు. ఇక అగ్ని-4ను భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రయోగిస్తే.. చైనా మొత్తాన్ని టార్గెట్‌ చేయవచ్చు. లాంగ్‌ రేంజ్‌ అగ్ని-5ని కూడా భారత్‌ అభివృద్ధి చేస్తోంది. 5వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించగల సామర్థ్యం ఉన్న ఈ ఖండాంతర క్షిపణిని దక్షిణాది నుంచి ప్రయోగించినా. చైనా మొత్తాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చు’ అని క్రిస్టెన్సన్‌, నోరీస్‌ తమ ఆర్టికలో ప్రస్తావించారు.

మొత్తానికి భారత్ -చైనా సరిహద్దులో ఉద్రిక్తలతో ఏం జరుగుతోందన్న టెన్షన్ ఉంది. ఇరుదేశాల బలబలాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. భారత్-చైనా శక్తులపై వస్తున్న కథనాలు ఆసక్తి రేపుతున్నాయి.