టీం ఇండియా రేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయపడి ఆరు నెలలైంది. ఇదిగో వచ్చేశాడు..వస్తున్నాడు అని బీసీసీఐ ప్రకటించడం తప్పా మైదానంలోకి అయితే బరిలో దిగింది లేదు. ఈ ఏడాది మొదటిలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసి మళ్లీ తప్పించారు. అదే విధంగా బోర్డర్ -గవాస్కర్ ట్రోపీ కోసం సెలెక్ట్ చేసినా..పూర్తిగా కోలుకోలేదని టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయాడు.
ఇక బుమ్రాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ ఆడడంపై ఉన్న శ్రద్ధ..దేశానికి ఆడడానికి పెట్టడలేదంటూ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు కూడా మార్చి 31 నుంచి జరగబోయే ఐపీఎల్ కోసమే బుమ్రా రెఢీ అవుతున్నాడని ఫైరవుతున్నారు. అభిమానులే కాదు మాజీల నుంచి కూడా పలు విమర్శలు, సూచనలు బుమ్రాకు వస్తున్నాయి.
భారత్ బౌలింగ్‌లో కీలక పేసర్ బుమ్రా. తన ప్రతిభతో జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. బుమ్రా విసిరిన పదునైన యార్కర్లు, ఖచ్చితమైన లెంగ్త్, స్లో బాల్స్‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థులకు కఠనమైన సవాలే. అలాంటి బుమ్రా గాయం కారణంగా గతేడాడి సెప్టెంబర్‌లో జట్టుకు దూరమయ్యాడు. దీంతో ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లకు బుమ్రా లేకుండా బరిలోకి దిగిన టీంఇండియా.. తన మూల్యం చెల్లించుకుంది. 2023లో కూడా బుమ్రా రాక కోసం అభిమానులు ఎదురుచూడక తప్పడం లేదు. కీలక సిరీస్‌ల సమయానికి కూడా అతడు ఫిట్‌నెస్ సాధించకపోవడంపై అభిమానుల ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. తాజాగా బుమ్రా అంశంపై భారత్ మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. ఐపీఎల్‌కు బుమ్రా దూరంగా ఉండాలని కోరాడు.
“బుమ్రా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకపోతే అతడిని ఐపీఎల్‌కు దూరంగా ఉంచాలి.దీనిపై బీసీసీఐ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. బుమ్రా మొదట భారత్ ఆటగాడు. తర్వాతే ఫ్రాంచైజీ ప్లేయర్. అంతర్జాతీయ ఈవెంట్‌లకు బుమ్రా పూర్తిస్థాయి ఫిట్‌గా ఉండాలని బీసీసీఐ కోరుకుంటే కొన్ని ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్ లు ఆడించకపోతేనే మంచింది. ముంబాయి తరఫున బుమ్రా ఓ 7 మ్యాచ్‌లు ఆడకపోతే ప్రపంచేమీ ఆగిపోదు. జోఫ్రా అర్చర్‌తో ఆడుతుంది నో ప్రాబ్లెమ్” అని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు.