నాలుగు దేశాలు...రెండు యుద్దాలు... - MicTv.in - Telugu News
mictv telugu

నాలుగు దేశాలు…రెండు యుద్దాలు…

August 12, 2017

నాలుగు దేశాలు, రెండు యుద్దాల గురించే ప్రపంచం మాట్లాడుకుంటున్నది. ఈ నాలుగు దేశాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళనా ఉంది.ఇందుట్లో రెండు దేశాలైతే మరీ దూకుడు మీదున్నాయి. ప్రపంచానికి కొత్త సమస్యలే తెస్తాయో లేక పోతే కేవలం బేదిరింపులతోనే సర్దుకుంటాయో తెలియడం లేదు. మరీ ఈ నాలుగు దేశాల స్టోరీ గురించి తెలుసుకుందం……

ఇండియా చైనా మధ్య యుద్దం తప్పదనే వార్తలు నెల రోజుల నుండి మీడియాలో వస్తున్నాయి. చైనా సైన్యం రోజూ ఏదో కవ్వింపు చర్యకు పూనుకుంటూనే ఉన్నది. భారత సరిహద్దులో నిత్యం ఏదో పంచాయితీ పెట్టాలని చూస్తూనే ఉన్నది. అంతే కాదు డోక్లామ్  రహదారి  వివాదంపై చైనా మీడియా రకరకాల స్టోరీలు రాస్తున్నది. భారత్ ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని అంటున్నది. ఇంకో వైపు ఇరుదేశాలకూ యుద్దం మంచిది కాదని చెప్తున్నది.

మరోవైపు చైనా తన సైన్యాన్ని సరిహద్దులో మొహరిస్తున్నది. ఇటు ఇండియా వైపు నుండి సైన్యం అటు వైపుగా వెళ్తున్నదనే వార్తలు వస్తున్నాయి. భారత్, బూటాన్, చైనా బార్డర్ల ఉన్న గ్రామం వైపు ఇండియన్ దళాలు కదులుతున్నాయనే వార్తులు వస్తున్నాయి. అక్కడికి కొన్ని కిలోమీటర్ దూరంలో ఉన్న  ఓ గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారని అంటున్నారు. ఈ దళాలను అక్కడే ఉంచుతారనే  ప్రచారం కూడా జరుగుతున్నది. అయితే ఇది కేవలం  ప్రతీ యేటా అక్కడ నిర్వహించే విన్యాసాల కోసమేనని అధికారులు అంటున్నారు. ఓవరాల్ గా చూస్తే అక్కడ టెన్షన్   వెదర్ ఉంది.

ఇక అమెరికా, ఉత్తర కొరియాల మధ్య యుద్దం ఏ క్షణంలోనైనా రావొచ్చనే వార్తలు ప్రపంచంలో మరింత టెన్షన్ పెంచుతున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు దూకుడుతో ట్రంప్ మరింత ఎగిరి పడుతున్నాడు.. ఆయన అస్సలే ట్రంప్  యుద్దం తప్పదని.. తమను అనవసరంగా రెచ్చగొడుతున్నారని అంటున్నారు. ఉత్తర కొరియాపై  పెద్ద ఎత్తున అమెరికా ఆంక్షలు పెట్టింది. దీని గురించి ప్రపంచం వ్యతిరేకించ లేదు. పైగా ఈ రెండు దేశాల వైఖరిని గమనిస్తున్నాయి. మరోసారి యుద్దాన్ని ఏ దేశమూ కోరుకోదని చెప్తూనే యుద్దం అంటూ వస్తే ఏంటి పరిస్థితి అని  అంచనాలు వేసుకుంటున్నాయి మిగిలిన దేశాలు.

మరీ నాలుగు దేశాల మధ్య జరుగుతున్న… ముదురుతున్న వాద, వివాదాలు ఎటు వైపు దారి తీస్తాయో  తెలియదు కానీ యావత్  ప్రపంచం చూపును మాత్రం తమ వైపుకు తిప్పుకుంటున్నాయి. ఎవరి బలాలు వారికున్నాయి. ఎవరి బలహీనతలూ వారికున్నాయి. అందరికీ అవసరమై వ్యాపారమనే అస్సలు పాయింట్ యుద్దాన్నే ఆలోచనల్లో పడేస్తున్నది.