గర్భ సంచి లేకున్నా..అమ్మ అయ్యే అవకాశం... - MicTv.in - Telugu News
mictv telugu

గర్భ సంచి లేకున్నా..అమ్మ అయ్యే అవకాశం…

May 20, 2017

పిల్లలు లేరు అని బాధపడేవారికో గుడ్ న్యూస్.. పుట్టుకతో గర్భసంచి లేదనే మధపడుతున్న వారికి ఇక ఆ చింత అక్కర్లేదు. తల్లి గర్భాశయంతో మాతృత్వపు ఆనందాన్ని పొందవచ్చు. దేశంలో తొలి గర్భాశయ మార్పిడి శస్త్రచికిత్సను పుణె వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.

దేశ వైద్య చరిత్రలో సరికొత్త రికార్డ్ క్రియేట్ అయింది. గర్భసంచి లేకుండా పుట్టిన తన కుమార్తె(21)కి తల్లి(43) తన గర్భాశయాన్ని ఆమెకు దానం చేసింది. అత్యంత సంక్లిష్టమైన ఈ గర్భసంచి మార్పిడి శస్త్రచికిత్సను పుణెలోని గెలాక్సీ కేర్‌ ఆస్పత్రి వైద్యులు గురువారం విజయవంతంగా పూర్తిచేశారు. మనదేశంలో జరిగిన తొలి గర్భసంచి మార్పిడి ఇదే కావడం విశేషం. శస్త్రచికిత్సకు తొమ్మిదిన్నర గంటల సమయం పట్టిందని.. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ శైలేష్‌ పుంతంబేకర్‌ చెప్పారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇలాంటి ఆప‌రేఫ‌న్లు 25 మంది మ‌హిళ‌ల‌కు చేశారని, 2013లో స్వీడ‌న్‌లో మొద‌టి సారిగా గ‌ర్భాశ‌య మార్పిడి ఆప‌రేష‌న్‌ను విజ‌య‌వంతంగా చేశారు.