దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు అధికమవుతూ.. క్రమంగా పది వేలవైపు పరుగులు పెడుతున్నాయి. బుధవారం 5233 మంది పాజిటివ్‌లుగా నిర్ధారణకాగా, నేడు ఆ సంఖ్య 7240కి చేరింది. ఇది బుధవారం నాటికంటే 40 శాతం అధికమని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజా కేసులతో మొత్తం బాధితులు 4,31,97,522కు చేరారు. ఇందులో 4,26,40,301 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,723 మంది మృతిచెందారని తెలిపింది. బుధవారం 3,591 మంది కోలుకున్నారు.. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.71 శాతానికి చేరింది. మృతుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.08 శాతం వద్ద ఉంది.
ఇక దేశంలో బుధవారం 15,43,748 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,94,59,81,691కు చేరింది. మరో 3,40,615 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.