ప్రాణాలను తీసిన ఆన్ లైన్ గేమ్... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రాణాలను తీసిన ఆన్ లైన్ గేమ్…

July 31, 2017

స్మార్ట్ ఫోను లో ఆన్ లైన్ గేమ్ ఆడుతూ ఓ 14 ఏండ్ల అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఆ అబ్బాయి ఎందుకు సుసైడ్ చేసుకున్నాడో
తెలియలేదు. ముంబాయి లోని అంధేరీ ప్రాంతానికి చెందిన అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అతను బ్లూవేల్ అనే ఆన్ లైన్ గేమ్ ఆడుతూ ఇంట్లో ఉన్నాడు. బ్లూవేల్ ఓ అండర్ గ్రౌండ్ గేమ్. ఈ గేమ్ లో మెత్తం 50 టాస్క్ లు ఉంటాయి. ప్రతీ టాస్క్ ని పూర్తి చేస్తూవాటికి సంబంధించిన ఫోటోలు తీసి పోస్ట్ చేస్తుండాలి. అలానే ఈ బాలుడు కూడా ఈ గేమ్ ఆడుతుండగా, ఆ బాలుడుకి భవనం పై నుంచిదూకి ఆత్మహత్య చేసుకోవాలని .ఆ టాస్క్ లో ఉండడంతో ఒక్కసారి కూడా ఆలోచన చేయకుండా తను నివసిస్తున్నా నాలుగు అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకేశాడు.బాలుడు తలకు తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

బాలుడు గేమ్ ఆడుతూ చనిపోయాడా లేదా మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా తెలియాల్సి ఉందన్నారు. తమ కూమారుడికి పైలట్ కావాలన్నా కోరిక ఉండేదని . రష్యాకు వెళ్లి పైలట్ గా ట్రెనింగ్ తీసుకుంటానని చేప్పేవాడని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తెలిపారు. ఈ బ్లూవేల్ గేమ్ రష్యాకు చెందిన గేమ్ దీనిని ఆడుతూ చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారని ఈ గేమ్ ను రూపోందించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ బ్లూవేల్ గేమ్ ఆడుతూ చాలా దేశాలలొ చాలా మంది ప్రాణాలను పొగొట్టుకున్నారు కాని భారత్ లో ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం ఇదే మెదటిసారి. అయినా ఏం గేమ్ లో,ఏం మనుషు లో, రాను రాను టెక్నాలజీ అభివృద్ది చెందుతుంటే, మనిషి మాత్రం విచక్షణ కోల్పోతున్నాడు.