శ్రీలంకతో జరుగుతున్న టీ20 మ్యాచులో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 5 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 37, దీపక్ హుడా 41, కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 29, అక్షర్ పటేల్31 పరుగులతో రాణించారు. భారీ అంచనాలున్న శుభ్ మన్ గిల్, సంజూ శామ్సన్, సూర్యకుమార్ యాదవ్ పేలవ ఆటతీరుతో నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో ఐదుగురు తలా ఒక వికెట్ తీశారు. ఇక 163 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన శ్రీలంక మొదటి ఓవర్ ముగిసే సరికి 3 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు కుశాల్ మెండిస్, నిస్సాంక ఉన్నారు.