India sets ‘new record’ by giving 2 billion vaccine doses in just 18 months
mictv telugu

చరిత్ర సృష్టించిన భారత్.. 200 కోట్ల కొవిడ్ టీకా డోసుల పంపిణీ

July 17, 2022

కరోనా వ్యాక్సినేషన్‌లో పంపిణీలో భారత్ మరో మైలురాయి సాధించింది. ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది. 2021 జనవరి 16న భారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ఇక దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 20 వేలకుపైనే నమోదవుతుండటం.. యాక్టివ్ కేసులు 1.5 లక్షలకు చేరువవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 3,92,569 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 20,528 కేసులు వెలుగులోకి వచ్చాయి. నిన్న కరోనాతో 49 మంది ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 5,25,709కు చేరింది. శనివారం 17,790 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.3 కోట్లు (98.47%) దాటింది.

కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిన్న 25,59,840 మందికి టీకాలు వేయగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన కోవిడ్ డోసుల సంఖ్య 200 కోట్ల కు చేరింది. దీంతో ఆదివారంతో వ్యాక్సినేషన్ మరో ఘనతను సాధించింది.