ఇంత చెత్తా? న్యూజెర్సీలో భారతీయుల దీపావళిపై విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

ఇంత చెత్తా? న్యూజెర్సీలో భారతీయుల దీపావళిపై విమర్శలు

October 29, 2019

India Square in New Jersey littered with trash on Diwali

నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ పథకాన్ని తీసుకొచ్చి దేశంలో చెత్తలేకుండా అడుగులు వేస్తోంది. మరోపక్క.  మిగతా దేశాల్లో నివసిస్తున్న భారతీయులు మాత్రం రోడ్లపై చెత్త వేస్తూ దేశానికి చెడ్డపేరు తెస్తున్నారు. తాజాగా అమెరికా దేశం న్యూజెర్సీలో జరిగిన సంఘటనే ఇందుకు చక్కటి ఉదాహరణ. 

న్యూజెర్సీలోని ఇండియా స్క్వేర్‌‌లో భారతీయులు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భారీగా టపాసులు కాల్చారు. టపాసులు కాల్చేసిన తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఖాళీ డబ్బాలతో, కాల్చి పడేసిన టపాసులతో వీధి అంతా చెత్త పేరుకుపోయింది. టపాసులు కాల్చడం వల్ల భారీగా పొగలు కమ్ముకున్నాయి. దీంతో అక్కడి సిబ్బంది నీళ్లతో వీధిని శుభ్రం చేయటానికి కదిలారు. ఎంతో ఓపిగ్గా ఇండియా స్క్వేర్‌‌‌ను శుభ్రం చేశారు. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో భారతీయులు చేసిన పనికి నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఆ వీధిని ఓపిగ్గా శుభ్రం చేసిన సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.