INDIA, SRILANKA LIVE SCORE
mictv telugu

విరాట్ మెరుపు సెంచరీ..భారత్ భారీ స్కోర్…

January 10, 2023

INDIA, SRILANKA LIVE SCORE

శ్రీలంకతో మొదటి వన్డేలో రన్ మిషన్ విరాట్ కోహ్లీ(87 బంతుల్లో 113) చెలరేగాడు. వన్డేలో 45వ సెంచరీని నమోదు చేశాడు. దూకుడుగా ఆడిన కోహ్లీ కేవలం 80 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. కోహ్లీతో పాటు రోహిత్ (67 బంతుల్లో83), శుభమన్ గిల్(60 బంతుల్లో 70) రాణించడంతో భారత్ భారీ స్కోర్ సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో రజిత 3, మధుశనకా, కరుణరత్నే శనకా, డిసిల్వా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

ఓపెనర్లు శుభారంభం

రోహ్లిత, గిల్ జోడి జట్టుకు మంచి శుభారంభాన్ని అందించింది. 19.4 ఓవర్లలో 143 పరుగులు జోడించారు. ముందుగా గిల్ ఔటవ్వగా, తర్వాత రోహిత్ పెవిలియన్‎కు చేరాడు.అదరిపోయే ఆరంభాన్ని కోహ్లీ చక్కగా వినియోగించుకుంటూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వికెట్లు పడుతున్న దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ (28)తో మూడో వికెట్ కు 40 పరుగులు, నాల్గో వికెట్ కు రాహుల్ (39)తో 90 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. చివరిలో హార్దిక్, అక్షర్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా కోహ్లీ తన ఫామ్‎ను కొనసాగించాడు.సెంచరీ తర్వాత దూకుడు ఆడే క్రంలో 48.2 ఓవర్లు వద్ద కుశాల్ మెండీస్‎కు క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.

విరాట్ రికార్డులు

వన్డే కెరీర్‎లో 45వ సెంచరీ సాధించిన కోహ్లీ తన పేరిట పలు కొత్త రికార్డులను లిఖించున్నాడు. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(20) సరసన కింగ్ కోహ్లీ చేరాడు. అదేవిధంగా ఒకే దేశంపై అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా కూడా కోహ్లీ, సచిన్‌ను సమం చేశాడు. వెస్టిండీస్, శ్రీలంకపై కోహ్లీ 9 సెంచరీలు సాధించగా, ఆస్ట్రేలియాపై సచిన్ టెండూల్కర్ కూడా 9 సెంచరీలు చేశాడు. 257 మ్యాచ్‌ల్లోనే 12500 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. కోహ్లీ తర్వాత సచిన్(310), పాంటింగ్ (328) ఉన్నారు.