India started the ODI match against New Zealand
mictv telugu

కివీస్ తో తొలివన్డే.. నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు

November 25, 2022

India started the ODI match against New Zealand

కివీస్ పర్యటనలో భాగంగా ఇప్పటికే టీ20 సిరీస్ గెలిచిన భారత్.. శుక్రవారంతో వన్డే సిరీస్ ను ప్రారంభించింది. ఆక్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో తొలుత టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ కి దిగింది. ఈ మ్యాచ్ ద్వారా ఇద్దరు భారత ఆటగాళ్లు వన్డే ఫార్మాట్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్ లు కెరీర్ లో తొలి వన్డే ఆడుతున్నారు. ఓపెనర్లు గా దిగిన శిఖర్ ధావన్, శుభ్ మన్ గిల్ లు ఆచితూచి ఆడుతున్నారు. న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండడంతో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా సింగిల్స్ తో సరిపెట్టుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 18.1 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 78 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్ 53 బంతుల్లో 40, శిఖర్ ధావన్ 55 బంతుల్లో 40 పరుగుల వద్ద ఉన్నారు. అటు ఆటకు వర్షం అంతరాయం కలిగించే అవకాశముందని సమాచారం.