సుష్మాస్వరాజ్ ను అమ్మా అన్న పాకిస్థాన్ అమ్మాయి... - MicTv.in - Telugu News
mictv telugu

సుష్మాస్వరాజ్ ను అమ్మా అన్న పాకిస్థాన్ అమ్మాయి…

August 14, 2017

కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ భారతీయులు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న ఆమె నుంచి సాయం అందుతుంది. స్వదేశీయులకే కాదు విదేశీయులు కూడా కష్టాల్లో ఉన్నారని ఆమె సాయం అందించి మానవత్వాన్ని చాటారు. పాకిస్థాన్ కు చెందిన పైజా తన్వీర్ తనకు మెడికల్ వీసా ఇప్పించాలని సుష్మాని అభ్యర్థించారు.

పాకిస్థాన్ కు చెందిన పైజా తన్వీర్ ఓరల్ క్యాన్సర్ తో బాధపడుతుంది. తను ఇండియలోని ఓ ఆసుపత్రిని సంప్రదించింది. తను భారత్ కు రావడం కోసం మెడికల్ వీసా ఆలస్యం కావడంతో, మేడం మీరే నాకు అమ్మ, నాకు సాయం చేయండి . 70 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం మీరు జరుపుకుంటున్నారు ఆ ఖుషిలో నాకు మెడికల్ వీసా ఇప్పించండి అని పైజా తన్వీర్ సుష్మాకు ట్వీట్ చేసింది.

పైజా ట్వీట్ కు స్పందించిన సుష్మాస్వరాజ్ . స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినందుకు దన్యవాదాలు. నీ ట్రీట్ మెంట్ కోసం మెడికల్ వీసా ఇస్తున్నాం అని ట్వీట్ చేసి సుష్మాస్వరాజ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.