భారత దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే డీఆర్డీవో మరో మైలురాయిని అధిగమించింది. తొలిసారిగా మానవ రహిత విమానాన్ని పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్ష నిర్వహించగా, ఖచ్చితమైన టార్గెట్‌తో విమానం గాల్లోకి దూసుకెళ్లింది. అంతేకాక, సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ విమానానికి అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్‌స్ట్రేటర్‌గా నామకరణం చేశారు. ఎలాంటి లోపాలు లేకుండా పరీక్ష విజయవంతం అవడంతో పరిశోధకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అపూర్వ ఘనతను సాధించారంటూ కొనియాడారు. ఆత్మనిర్భర భారత్ విషయంలో ఇదో మైలురాయి అంటూ శాస్త్రవేత్తలను పొగిడారు. ఈ వీడియో డీఆర్డీవో తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా, వ్యూస్‌తో వైరల్‌గా మారింది.
#DRDOUpdates | Successful Maiden Flight of Autonomous Flying Wing Technology Demonstrator@PMOIndia https://t.co/K2bsCRXaYp https://t.co/brHxaH7wbF pic.twitter.com/SbMnI5tgUM
— DRDO (@DRDO_India) July 1, 2022