దేశానికి త్వరలో కొత్త పార్లమెంట్!
2022 ఆగష్టు 15న ఇండియా 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోనుంది. ఆ సమయం లోపు దేశానికి కొత్త పార్లమెంట్ నిర్మించాలని లేదా ఉన్న భవనాలకే ఆధునిక హంగులద్దాలని కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ఆ ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించిన భవనంలో లేదా ఆధునిక హంగులద్దిన భవనంలో జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు ఇటీవల తెలిపాయి.
ఈ నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్ సంస్థలను ఆహ్వానించింది. కొత్తగా నిర్మించనున్న ఈ భవనాలు కనీసం 200 ఏళ్లపాటు సేవలు అందించనున్నాయని అంచనా. ఫ్లోటింగ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌లోని నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడున్న పార్లమెంట్ భావన సముదాయం స్వాతంత్య్రానికి ముందు 1927లో నిర్మితమైనవి. ప్రస్తుతం కావాల్సిన అవసరాలను అది అందుకోలేకపోతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే కొత్త భవనం నిర్మించాలా లేక పాతదాన్నే పునర్నిర్మించాలా? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబందించిన కార్యాలయాలను నిర్వహించేందుకు ఏటా వెయ్యి కోట్ల ఖర్చువుతోంది. కొత్త పార్లమెంట్ భవనాలు నిర్మించడం ద్వారా ఈ వ్యయాన్ని ఆదా చేయచ్చని ప్రభుత్వం భావిస్తోంది.