రూ.50కే భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచ్ టిక్కెట్ ధర! - MicTv.in - Telugu News
mictv telugu

రూ.50కే భారత్-బంగ్లా టెస్ట్ మ్యాచ్ టిక్కెట్ ధర!

October 30, 2019

భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది. చరిత్రలో తొలిసారి టీమిండియా డే/నైట్‌ టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో డే/నైట్ టెస్ట్ ఆడే ప్రతిపాదనను బీసీసీఐ కొత్త బాస్ సౌరవ్ గంగూలీ జట్టు ముందుంచారు. అందుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించారు. దీంతో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా నవంబర్‌ 22 నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య తొలి డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ఎక్కువ మంది అభిమానులు హాజరయ్యేలా బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ చర్యలు తీసుకొంటుంది. ఇందుకోసం ఈ మ్యాచ్ చూడడానికి కనీస టికెట్‌ ధరను రూ.50గా నిర్ణయించే అవకాశం ఉందని బీసీఏ కార్యదర్శి అభిషేక్‌ దాల్మియా తెలిపారు. 

BCCI, India.

సాధారణంగా డే/నైట్‌ మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 నుంచి మొదలవుతాయని, మంచు ప్రభావం నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను ఒక గంట ముందే ప్రారంభించి.. రాత్రి 8:30 కల్లా పూర్తయ్యేలా బీసీసీఐని అనుమతి కోరుతున్నామని తెలిపారు. 68 వేల కెపాసిటీ సామర్థ్యమున్న ఈ స్టేడియాన్ని నింపేందుకు కనీస టికెట్‌ ధరను రూ.50గా నిర్ణయించనున్నట్టు వెల్లడించారు. బీసీసీఐ నుంచి మ్యాచ్‌ నిర్వహణ సమయంపై స్పష్టత రాగానే టికెట్ల ప్రింటింగ్‌ ప్రక్రియ ప్రారంభించనున్నట్టు తెలిపారు. రోజువారీగా టికెట్ల ధరలను రూ.50, 100, 150గా నిర్ణయిస్తామని, తద్వారా అత్యధిక మంది ప్రేక్షకులను స్టేడియానికి రప్పించవచ్చు అని తెలిపారు.