అఫ్ఘాన్తో వన్డే సిరీస్.. విరాట్ vs నవీన్ ఉల్ హక్కు నో ఛాన్స్.. ఎందుకంటే…?
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎప్పుడు ముగుస్తుందా.. మళ్లీ కోహ్లీ vs నవీన్ ఉల్ హక్ ఫైట్ సీన్ ఎప్పుడు రిపీట్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు నిరాశ మిగిలింది. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ సహా రోహిత్ శర్మ, మహమ్మద్ షమీలకు రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే, ఈ సిరీస్ ముందుగా అనుకున్నది కాకపోయినా.. ఐసీసీ క్యాలెండర్ ఇయర్లో లేకపోయినా. కేవలం అఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డ్ కోరిక మేరకు బీసీసీఐ ఈ సిరీస్కు అంగీకరించింది. అయితే, ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ కారణంగా టీమిండియా ఈ సిరీస్ ఆడుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సీనియర్లకు విశ్రాంతినిచ్చి, ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్లకు ఈ సిరీస్లో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని చేపడతాడు. అంతేకాకుండా ఈ ఐపీఎల్లో సత్తా చాటిన యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ టీమిండియాలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ లాంటి ఆటగాళ్లను బీసీసీఐ పరీక్షించేందుకు ఇదే మంచి అవకాశం కానుంది. అయితే, ఈ సిరీస్ జరుగుతుందా లేదా అన్నది ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తర్వాత తేలుతుంది. ఒకవేళ ఇరు బోర్డుల మధ్య ఒప్పందం కుదిరితే జూన్ నెలలో ఈ సిరీస్ నిర్వహిస్తారు.