ఇండియాలోనే 2020 ఫిఫా వరల్డ్ కప్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియాలోనే 2020 ఫిఫా వరల్డ్ కప్

March 16, 2019

ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంట్లకు ఆతిధ్యం ఇస్తున్న ఇండియా.. మరో ప్రపంచ ప్రఖ్యాత ఫిఫా వరల్డ్ కప్‌కు కూడా ఆదిత్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. 2020 అండర్-17 మహిళల ప్రపంచకప్ ఇండియాలో జరపాలని ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఫిఫా) నిర్ణయించింది. శుక్రవారం ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినో అండర్-17 ప్రపంచకప్‌కు ఇండియా ఆతిథ్యమివ్వనుందని ప్రకటించారు. అమెరికాలోని మియామీలో జరిగిన ఫిఫా కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇండియాలో మహిళల ఫుట్‌బాల్ ప్రాచుర్యానికి ఈ టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడనుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఇండియాలో జరిగే రెండవ ఫిఫా టోర్నమెంట్. ఇంతకుముందు 2017 అండర్-17 మెన్స్ ఫిఫా వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యమిచ్చింది.