అమెరికాపై భారత్ భారీ ప్రతీకారం.. సుంకాలపై కుమ్ముడు.. - MicTv.in - Telugu News
mictv telugu

అమెరికాపై భారత్ భారీ ప్రతీకారం.. సుంకాలపై కుమ్ముడు..

June 14, 2019

India to impose counter tariff on 29 US items from June 16.

‘మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరమో, మా ఇల్లూ మీ ఇంటికి అంతే దూరం’ అంటోంది భారత్. పలు వర్ధమాన దేశాల నుంచి చేసుకుంటున్న దిగుమతులపై అమెరికా భారీ సుంకాలను విధిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా ఎదురుదాడికి దిగింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఆల్మండ్, వాల్‌నట్, పప్పులు వంటి 29 వస్తువులపై  కస్టమ్స్ సుంకాలను భారీగా పెంచి పడేసింది. నెల 16 నుంచి నిర్ణయం అమల్లోకి రానుంది. వాల్‌నట్‌పై సుంకాన్ని 30 శాతం నుంచి 120 శాతానికి, చనా, మసూర్ దాల్‌పై సుంకాన్ని 30 శాతం నుంచి 70 శాతానికి పెంచారు.

భారత్ నుంచి దిగుమతి చేసుకునే అల్యూమినియం, ఉక్కు వంటి వాటిపై అమెరికా ఇటీవల సుంకాలను 10 నుంచి 25 శాతం వరకు పెంచింది. దీంతో భారత వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రతిగా భారత్ పై నిర్ణయం తీసుకుంది. సుంకాల పెంపుతో అమెరికా ఎగుమతిదారులు ఇబ్బంది పడనున్నారు. తమ ఎగుమతులపై పెంచిన సుంకాలను తగ్గించాలని పలుమార్లు అమెరికాకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తాము కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచినట్లు భారత అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల భారత్‌లో పప్పు ధాన్యాల ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.