కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో పెద్ద సంఖ్యలో భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. మొత్తం 14,800 మందిని భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
వారి కోసం ఈనెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 64 ప్రత్యేక విమానాలు నడపనుంది. దశల వారీగా విదేశాల్లో చికుక్కున భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నారు. స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న పౌరుల నుంచి
విమాన చార్జీలు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. లండన్ నుంచి ఢిల్లీ వచ్చే విమానంలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.50 వేలు, ఢాకా నుంచి ఢిల్లీ వచ్చేందుకు రూ.12 వేలు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలి విడతలో భాగంగా అమెరికా, గల్ఫ్ దేశాలు, మలేసియా, యూకే, సింగపూర్, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ లకు విమానాలు నడపనున్నారు.