గాడిద పాల డెయిరీ.. దేశంలోనే తొలిసారిగా.. - MicTv.in - Telugu News
mictv telugu

గాడిద పాల డెయిరీ.. దేశంలోనే తొలిసారిగా..

August 10, 2020

India to soon get dairy for donkey milk.

డైరీ అనగానే బర్రె పాలు లేదా ఆవు పాలు గుర్తుకు వస్తాయి. ప్రజలు కొన్ని అవసరాలకు గాడిద పాలను కూడా వినియోగిస్తారు. కానీ, వాటి కోసం అంటూ డైరీలు ఉండవు. కొందరు ఊళ్ళల్లో తిరుగుతూ గాడిద పాలను అమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ఈక్వెన్స్ (ఎన్ఆర్సిఈ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో హర్యానాలోని హిస్సార్‌లో గాడిద పాల డెయిరీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ డైరీలో హలారి జాతి గాడిద నుంచి సేకరించిన పాలను ఉండనున్నారు. ఇందుకోసం పది వేల హలారి జాతి గాడిదలను ఎన్ఆర్సిఈ తెప్పించింది. ఈ గాడిద పాలను లీటర్ కి రూ.7వేల చొప్పున అమ్మనున్నారు.

ఈ గాడిద పాలు మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయని ఎన్ఆర్సిఈ పరిశోధకులు చెబుతున్నారు. ఎన్నో ఆయుర్వేద మందుల తయారీలోనూ గాడిదపాలను ఉపయోగిస్తున్నారు. హలారి జాతి గాడిద పాలను ఔషధాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. క్యాన్సర్, అలర్జీ, ఊబకాయం వంటి వ్యాధులతో గాడిద పాల పోరాడుతాయి. గాడిద పాలల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీఏజింగ్ ఎలిమెంట్స్ అధికంగా ఉంటాయి. గాడిద పాలతో సౌందర్య ఉత్పత్తులను కూడా తయారు చేస్తారు. ఈజిప్ట్ రాణి క్లియో పాత్ర కూడా గాడిద పాలతో స్నానం చేసేదని చరిత్ర చెబుతోంది.