చైనాలో పుట్టిన టిక్‌టాక్ ఇండియాలో టాప్.. ఏకంగా 8 కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

చైనాలో పుట్టిన టిక్‌టాక్ ఇండియాలో టాప్.. ఏకంగా 8 కోట్లు

February 3, 2020

Tik Tok,.

చైనాలో పుట్టిన టిక్‌టాక్ యాప్ ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే అగ్రశ్రేణిలో ఉంది. భారత్ తర్వాతి స్థానంలో చైనా నిలిచింది. డిసెంబర్ 2019 నాటికి భారత్‌లో టిక్‌టాక్ నెలవారీ క్రియాశీల వినియోగదారులు 90% పెరిగి 81 మిలియన్లకు చేరుకుందని ఓ నివేదిక వెల్లడించింది. అలాగే ప్రపంచ స్థాయిలోనే ఎదురులేకుండా ఉన్న సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు కూడా టిక్‌టాక్ గట్టి పోటీ ఇస్తోందని తెలుస్తోంది. 2019 సంవత్సరంలో వినియోగదారులు ఫేస్‌బుక్‌లో 25.5 బిలియన్ గంటల పాటు గడిపారు. ఫేస్‌బుక్‌ 2018 తో పోలిస్తే ఈ సంవత్సరం 15% ఎక్కువ రేటింగ్‌ను పెంచుకుంది. 

అలాగే నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్య కూడా 224 మిలియన్లకు పెరిగింది. అలాగే 20% వృద్ధితో డిసెంబర్ నాటికి 137 మిలియన్లకు ఇన్‌స్టాగ్రామ్ కూడా తన నెలవారీ క్రియాశీల వినియోగదారుల సంఖ్యను పెంచుకుంది. ఫేస్‌బుక్ కంటే ఇన్‌స్టాగ్రామ్ వేగంగా 40% వృద్ధిని సాధించింది. కాగా, భారత్ మార్కెట్‌లో టిక్‌టాక్ వృద్ధి గణనీయంగా పెరిగింది అని అన్ని నివేదికలు వెల్లడించాయి. వాట్సాప్ తర్వాత గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్లలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేసిన రెండవ యాప్ టిక్‌టాక్ అని సెన్సార్ టవర్ తన నివేదికలో వెల్లడించింది.