జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన 67 శాతం మంది నెటిజన్లు! - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన 67 శాతం మంది నెటిజన్లు!

January 21, 2020

fdbhd

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ మూడు రాజధానుల బిల్లుకు సోమవారం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీంతో పాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు అయ్యే అవకాశం ఏర్పడింది.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలంటే మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో వెల్లడించారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించి జాతీయ మీడియా సంస్థ అయిన ఇండియా టీవీ ట్విట్టర్‌లో ఓ సర్వేను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశం సరైన ఆలోచనేనా? అంటూ పోల్ నిర్వహించింది. ఈ పోల్‌లో 67 శాతం మంది నెటిజన్లు తప్పుపట్టారు. 29 శాతం మంది సరైన నిర్ణయమేనని అభిప్రాయపడ్డారు. 4 శాతం మంది ఏమీ చెప్పలేమన్నారు. ఈ పోల్ సర్వేను ఇండియా టీవీ దాదాపు 5 గంటల సేపు నిర్వహించింది.