ఆశ్చర్యం! రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసిన భారత న్యాయమూర్తి - MicTv.in - Telugu News
mictv telugu

ఆశ్చర్యం! రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసిన భారత న్యాయమూర్తి

March 17, 2022

mmmmm

ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న దాడుల పట్ల ప్రపంచ దేశాలు ఎలాంటి వైఖరి ప్రదర్శించినా, భారత్ మాత్రం ఇప్పటి వరకు తటస్థంగా ఉండిపోయింది. యూరప్, అమెరికా దేశాలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఐక్యరాజ్యసమితిలో రెండు సార్లు జరిగిన ఓటింగ్‌కు గైర్హాజరవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో.. మంగళవారం అంతర్జాతీయ న్యాయ స్థానంలో భారత్‌కు చెందిన న్యాయమూర్తి,రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. రష్యా తక్షణమే దాడులు నిలిపివేయాలన్న తీర్మానానికి మద్ధతుగా భారత న్యాయమూర్తి దిలీప్ భండారి ఓటు వేశారు. రష్యా, చైనాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. కాగా, భారత్ న్యాయమూర్తి ఎందుకలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియరాలేదు. ఆయన జడ్జిగా తీసుకున్న నిర్ణయాన్ని భారత ప్రభుత్వ అధికార నిర్ణయంగా భావించకూడదని విశ్లేషకులు చెబుతున్నారు. 2018లో భారత్ ఆయనను ఐసీజేకు నామినేట్ చేసింది. కాగా  చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో 25 శాతం డిస్కౌంట్‌లో రష్యా భారత్‌కు చమురును విక్రయించేందుకు ముందుకు వచ్చిందని వార్తలు వచ్చాయి. అదే జరిగితే మనకు ఆర్థికంగా చాలా మేలు జరిగినట్టవుతుంది. ఈ నేపథ్యంలో భారత్ ఏం ఆశించి రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసిందో ప్రస్తుతానికి సస్పెన్సే.