పోర్న్‌సైట్లపై నిషేధం తూచ్.. 5.7 కోట్ల వీపీఎన్ డౌన్‌లోడ్స్ - MicTv.in - Telugu News
mictv telugu

పోర్న్‌సైట్లపై నిషేధం తూచ్.. 5.7 కోట్ల వీపీఎన్ డౌన్‌లోడ్స్

December 4, 2019

దేశంలో మహిళలపై సాగుతున్న ఘోరాలకు మద్యం, పోర్న్ వెబ్ సైట్లు కూడా కారణం. దీంతో మన ప్రభుత్వం వీటిపై నిషేధం వేటు వేసింది. ప్రముఖ అశ్లీల సైట్లన్నీ మూసుకుపోయాయి. పోర్న్ ప్రియులు ఈ నిషేధాన్ని తప్పించుకోడానికి అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రభుత్వం ఎన్ని సైబర్ ‘వాల్స్’పెట్టిగా కూలగొడుతూ అనుకున్నది చూసేస్తున్నారు. ఎంతగా అంటే.. ఒక ఏడాదిలోనే వీపీఎన్ యాప్స్ డౌన్ లోడ్ల సంఖ్య 405 శాతం పెరిగేంతగా. 

vpn

పోర్న్ చూసే యూజర్ల లొకేషన్లు తెలియకుండా వీపీఎన్ సాయం చేస్తుంది. పోర్న్ సైట్లపై నిషేధం విధించాక వీటిని ఫోన్లలోకి దిగుమతి చేసుకున్న వారి సంఖ్య 5.7 కోట్లని లెక్కతేలింది. యాపిల్స్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ల డేటాను విశ్లేషించి టాప్10వీపీఎన్ ఈ వివరాలు వెల్లడించింది. పోర్న్ హబ్, ఎక్స్ వీడియోస్ వంటి 827 వెబ్ సైట్లపై గత ఏడాది కోర్టు ఆదేశంతో భారత ప్రభుత్వం నిషేధ కొరడా ఝళిపించింది. దీంతో అవి దొంగపేర్లతో మళ్లీ వచ్చాయి. అయితే టెలికం నెట్వర్కులు వాటిని బ్లాక్ చేశారు. దీంతో శృంగారప్రియులు వీపీఎన్లపపై పడిపోయారు.  గత ఏడాది అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య వీటి డౌన్ లోడ్లు 66 శాతం పెరిగాయి. అంతేకాకుండా కోట్లాది మంది నిషేధం లేని రాసలీలల సైట్లకు మహరాజ పోషకులుగా మారిపోయారు.