భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ బౌలర్లు ఒక్కసారిగా విజృంభించారు. నిలకడగా ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లను స్వల్ప వ్యవధిలో ఔట్ చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 28 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది. క్రీజ్‌లో గ్రీన్, మ్యాక్స్ వెల్ ఉన్నారు. దూకుడు ఆడుతూ సెంచరీ దిశగా సాగిన మిచెల్ మార్ష్ (65 బంతుల్లో 81) ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసాడు. తర్వాత స్వల్ప వ్యవధిలోనే లబూషేన్ (22 బంతుల్లో 15) రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లీష్ ను షమీ బౌల్డ్ చేయడంతో కంగారులు సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయారు .సిరాజ్, పాండ్యా,జడేజా,కుల్దీప్, షమీ చెరో వికెట్ దక్కించుకున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ చివరి బంతికి హెడ్ క్లీన్ బౌల్డయ్యాడు.అనంతరం స్మిత్, మిచెల్ మార్ష్ మరో వికెట్ పడకుండా ఇన్సింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 72 పరుగులు చేశారు. చేశారు. హార్దిక్ బౌలింగ్‌లో స్మిత్ కీపర్ కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. స్మిత ఔటయ్యినా మిచెల్ దూకుడు కొనసాగించాడు. మూడో వికెట్‌కు 52 పరుగులు చేశారు. భారత్ బౌలర్లు విజృంభించి క్రమంగా వికెట్లు తీశారు.