భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆట ముగిసింది. రోహిత్ శర్మ(120) సెంచరీతో పాటు జడేజా(66*), అక్షర్ పటేల్(52*) అర్థసెంచరీలు చేయడంతో భారీ ఆధిక్యం దిశగా భారత్ దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఏడు వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది. తద్వారా 144 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించి. ఓవర్‌నైట్ స్కోర్ 77/1తో రెండో రోజు ఆట ప్రారంభించన భారత్ నేడు మొత్తం 244 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బౌలర్లలో మర్ఫీ 5 వికెట్లు, కమిన్స్, లియాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
మొదటి టెస్ట్‌లోనే ఐదు వికెట్లు తీసిన నాలుగో ఆసీస్ బౌలర్‌గా మర్ఫీ చరిత్ర కెక్కాడు.
మొదటి రెండు సెషన్స్‌లో రోహిత్ శర్మ ఇరగదీశాడు. మిగతా బ్యాటర్లు వెంటవెంటనే పెవిలియన్‌కు చేరినా రోహిత్ మాత్రం క్రీజ్‌లో నిలదొక్కుకొని టెస్ట్ కెరీర్‌లో తొమ్మిదో సెంచరీ సాధించాడు. ఆరో వికెట్‌కు జడేజాతో 61 భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు ఆధిక్యాన్ని సాధించి పెట్టాడు. ఇక 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ కమిన్స్ బౌలింగ్ బౌల్డవ్వడం.. తర్వాత వచ్చిన శ్రీకర్ భరత్ కూడా తక్కువ పరుగులకే వెనుదిరగడంతో భారత్ శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే ..జడేజా, అక్షర్ జోడి ఆసీస్ ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. కంగారు బౌలర్లను కంగారు పెట్టించారు. ఈ క్రమంలోనే ఇద్దరు అర్థసెంచరీలు సాధించి జట్టుకు మెరుగైన స్థితిలో ఉంచారు. ఎనిమిదో వికెట్‌కు 81 జోడించి అజేయంగా నిలిచారు. అంతకుముందు పుజారా(7), కోహ్లీ(12), సూర్యకుమార్ యాదవ్ (8) తక్కువ పరుగులకే ఔట్ అయ్యారు.