బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భారత్ బోణి కొట్టింది. నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఏకంగా 132 పరుగల తేడాతో ఇన్నింగ్స్ విజయం సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవలం 91 పరుగలకే కుప్పకూలింది. అశ్విన్ స్విన్ మాయాజాలనికి కంగారులు క్రీజ్‌లో నిలువలేకపోయారు. అశ్విన్ ఐదు వికెట్లు తీయగా జడేజా 2, షమీ 2, అక్షర్ 1 వికెట్లు తీసి రాణించారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ అత్యధికంగా 25 పరుగులు చేశాడు. అశ్విన్ టెస్టుల్లో 31వ సారి 5 వికెట్లు తీశాడు
అంతకుముందు 321/7తో మూడో రోజు ఆట ప్రారంభించిన టీం ఇండియా మరో 79 పరుగుల జోడించి 400 పరుగులకు ఆలౌటైంది. జడేజా 70, అక్షర్ పటేల్ 84 పరుగులు చేశాడు. చివరిలో షమీ మెరుపులు మెరిపించాడు. 47 బంతుల్లో 37 పరుగులు చేసాడు. రోహిత్ శర్మ(212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 120) సెంచరీతో జట్టు పటిష్ట స్థితిలో నిలబెడితే ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో భారీ ఆధిక్యాన్ని అందించారు. ఇక ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైంది. జడేజా (5/47), అశ్విన్ (3/42) విజృంభించడంతో తొందరగానే తోకముడిచింది. గాయం నుంచి కోలుకొని ఆల్ రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.