India vs Australia, 1st Test - Live Cricket Score
mictv telugu

తొలి టెస్ట్‌లో ఆచితూచి ఆడుతున్న ఆసీస్

February 9, 2023

 

India vs Australia, 1st Test - Live Cricket Score

బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొదటి టెస్ట్‎లో ఆస్ట్రేలియా ఆచితూచి ఆడుతుంది. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవంతో లబు షేన్(30), స్టీవ్ స్మిత్‌(14)లు జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు. మరో వికెట్ పడకుండాక్రీజ్‎లో నిలదొక్కుకుపోయారు. ప్రస్తుతం 23 ఓవర్లలో ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది.

2 పరుగులకే 2 వికెట్లు

టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‎కు మొదట్లోనే షాక్ తగిలింది. భారత్ బౌలర్లు విజృంభించడంతో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్ మొదటి బంతికి ఉస్మాన్ ఖవాజా ఔటవ్వగా..తర్వాతి ఓవర్లోనే వార్నర్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు.తర్వాత క్రీజ్ లోకి వచ్చిన లబు షేన్, స్టీవ్ స్మిత్‌‌లు భారత్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. లబుషేన్ అప్పుడప్పుడు బౌండరీలతో స్కోర్ బోర్డును కదిలిస్తున్నా..స్మిత్ మాత్రం పరుగులపై కాకుండా కేవలం క్రీజ్‎లో ఉండేందుకే దృష్టిపెడుతున్నాడు. వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు టీఇండియా కెప్టెన్ రోహిత్..స్పిన్నర్లను బరిలోకి దించాడు.