నాగపూర్ వేదికగా ఆసీస్, భారత్ మధ్య మొదటి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతుంది. మొదట్లో రెండు వికెట్లు తీసి భారత్ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తే..తర్వాత లబూషేన్, స్మిత్ జోడి కాసేపు క్రీజ్ లో నిలిచి భారత్ బౌలర్లను ఎదుర్కొన్నారు.చెత్త బంతులను బౌండరీలకు తరలిత్తూ అలా స్కోర్ బోర్డను కదిలించారు. ఈ క్రమంలోనే లంచ్ సమయానికి 32 ఓవర్లలో రెండు వికెట్లో కోల్పోయి 76 పరుగుల చేసింది ఆస్ట్రేలియా. లంచ్ తర్వాత కంగారులను రవీంద్ర జడేజా కంగారు పెట్టించాడు. వరుస బంతుల్లో లబూషేన్(49)తో పాటు, రెన్ షా(0)ను ఔట్ చేశాడు. అర్థసెంచెరికీ ఒక్క పరుగు దూరంలో నిలిచిన లబూషేన్ ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అవ్వగా..రెన్ షా ఎదుర్కొన్న మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.తర్వాత కాసేపటికే స్మిత్‌ను బౌల్డ్ చేసి ఆసీస్ నడ్డి విరిచాడు. ప్రస్తుతం ఆసీస్ 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. హ్యాండ్స్‌స్కాబ్ (16), అలెక్స్ క్యారీ(4) క్రీజ్‌లో ఉన్నారు.