ఆసీస్-భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌లో రోహిత్ శర్మ(107*)తో సెంచరీతో చెలరేగాడు. సహచరులు వెంటవెంటనే ఔటయ్యనా..హిట్ మ్యాన్ మాత్రం ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి నిలబడ్డాడు. ఈ క్రమంలో రెండేళ్ల తర్వాత శతకం సాధించాడు. ఇది రోహిత్ టెస్ట్ కెరీర్లో తొమ్మిదవ సెంచరీ. వన్డేల్లో 30, టీ20లో 4 సెంచరీలతో కలిపి అతడి కెరీర్లో మొత్తం 43 శతకాలు ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ పోరాటంతో భారత్ ఆసీస్‌పై ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. తద్వారా 31 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రోహిత్‌కు తోడు రవీంద్ర జడేజా(27) క్రీజ్‌లో ఉన్నాడు.
𝐑𝐨𝐡𝐢𝐭 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 𝐥𝐞𝐚𝐝𝐬 𝐟𝐫𝐨𝐦 𝐭𝐡𝐞 𝐟𝐫𝐨𝐧𝐭 𝐰𝐢𝐭𝐡 𝐚 𝐦𝐚𝐠𝐧𝐢𝐟𝐢𝐜𝐞𝐧𝐭 𝐂𝐞𝐧𝐭𝐮𝐫𝐲 🫡🫡
This is his 9th 💯 in Test Cricket.#INDvAUS @mastercardindia pic.twitter.com/yheIs70hjO
— BCCI (@BCCI) February 10, 2023
దెబ్బతీసిన మర్ఫీ..
ఈ మ్యాచ్ తోనే టెస్ట్ కెరీర్‌ను ప్రారంభించిన ఆసీస్ స్పిన్నర్ మర్ఫీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేస్తున్నాడు. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై నాలుగు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశాడు. రెండో రోజు ఆట ప్రారంభించి..క్రీజ్‌లో కుదురుకుంటున్న సమయంలో రోహిత్-అశ్విన్ జోడిని మర్ఫీ విడదీశాడు. 23 పరుగులు చేసిన అశ్విన్(23) ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. తర్వాత కాసేపటికే పుజారా(7), లంచ్ తర్వాత కోహ్లీ(12) కూడా మర్ఫీకి వికెట్లు సమర్పించుకున్నారు. రాణిస్తాడనుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా కేవలం 8 పరుగుల చేసి లియాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక ఎండల్ వికెట్లు పడుతున్నా రోహిత్ మాత్రం తన ఫామ్ కొనసాగిస్తున్నాడు.