India vs Australia, 1st Test - Live Score,
mictv telugu

విజృంభిస్తున్న భారత్ బౌలర్లు..గెలుపు దిశగా భారత్

February 11, 2023

 

India vs Australia, 1st Test - Live  Score,

విజృంభిస్తున్న భారత్ బౌలర్లు..గెలుపు దిశగా భారత్కేవలం 81 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అశ్విన్ మాయాజాలనికి ఆసీస్ ఆటగాళ్లు వరుసగా క్యూ కట్టారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్‌ పతనం రెండో ఓవర్ నుంచే ప్రారంభమైంది. ఓపెనర్ ఖవాజా(5)ను అశ్విన్ ఔట్ చేశాడు. తర్వాత ఆచితూచి ఆడుతున్న సమయంలో 11వ ఓవర్‎లో లబుషేన్..జడేజాకు వికెట్ల ముందు దొరికిపోయాడు.

ఇక అక్కడి నుంచి ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకుంది. ప్రస్తుతం స్టీవ్ స్మిత్(20), లియాన్ (4) క్రీజ్ లో ఉన్నారు. ఆశ్విన్ ఐదు వికెట్లు తీయగా, జడేజా 2, అక్షర్ 1 వికెట్ తీశారు. ఆసీస్ ఫాలోఆన్ దాటాలంటే ఇంకా ఆసీస్ 142 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు టీంఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 400 పరుగులకి ఆలౌటైంది.