india vs Australia 2nd ODI: India all out for paltry 117
mictv telugu

ఆసీస్ బౌలింగ్ ధాటికి కుదేలైన భారత్

March 19, 2023

విశాఖ‌ప‌ట్నంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆసీస్ పేస్ ధాటికి క్రీజ్‌లో నిలవలేకపోయారు. మిచెల్ స్టార్క్ 3, అబాట్ 3, ఎలీస్ 2 విజృంభించడంతో భారత్ కేవంల్ 26 ఓవర్లలో 117 పరుగులకే చేతులెత్తేసింది. ఆసీస్ జ‌ట్టు విజ‌య‌ల‌క్ష్యాన్ని చేరుకోవాలంటే 118 ప‌రుగులు చేయాల్సి ఉంది. విరాట్ కోహ్లీ 31, చివరిలో అక్షర్ పటేల్ 29* పరుగులు చేయడంతో 100లోపు ఆలౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది.

దెబ్బతీసిన స్టార్క్

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన భారత్ స్టార్క్ ఆరంభంలోనే దెబ్బతీశాడు. స్టార్క్ ను ఎదుర్కోలేక గిల్(0), రోహిత్(13), సూర్యకుమార్ యాదవ్(0), కేఎల్ రాహుల్ (9), వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. హార్దిక్(1) ను అబాట్ ఔట్ చేశాడు.దీంతో భారత్ 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. క్రీజ్‌లో కుదురుకున్నట్లు కనిపించిన కోహ్లీ, జడేజా ఇన్నింగ్స్ ‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో 31 పరుగులు చేసిన కోహ్లీ ఎలీస్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు, ఆ వెంటనే జడేజా కూడా ఔటయ్యపోయాడు. దీంతో 100 లోపే భారత్ ఆలౌట్ అవుతందని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. చివరిలో అక్షర్ పటేల్ విలువైన 29 పరుగులు చేసి స్కోరు బోర్డును 100 దాటించాడు.