మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో నెగ్గి ఊపుమీదున్న భారత్‌కు.. ఆస్ట్రేలియా ఓ సడెన్ బ్రేక్ వేసింది. ఆదివారం వైజాగ్‌లో రెండో వన్డేలో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా… ఓపెనర్లుగా దిగిన టీమిండియా బ్యాటర్లకు చిన్న ఝలక్ ఇచ్చింది. ఫస్ట్ ఓవర్‌లో వికెట్ తీసింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగారు. అయితే ఫస్ట్ ఓవర్ మూడో బంతికే గిల్(0).. లబుషేన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతని స్థానంలో క్రీజులోకి కోహ్లీ వచ్చాడు.
అంతకుముందు వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోతుందేమనని అంతా కంగారు పడ్డారు. కానీ మ్యాచ్ జరగబోయే సమయానికి వర్షం పూర్తిగా తగ్గి ఎండ వచ్చింది. అన్ని ఏర్పాట్లు చేశాక మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమైంది. అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నగరంలోని హనుమంతవాక ,కార్ షెడ్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.
ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, మార్ష్, స్మిత్ (కెప్టెన్), లబుషేన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), గ్రీన్, స్టాయినిస్,అబాట్,నాథన్ ఎల్లీస్, స్టార్క్, జంపా