India vs Australia 2nd Test : Australia All Out By 263 Runs
mictv telugu

India vs Australia 2nd Test : ఆసీస్ ఆలౌట్..భారత్ బ్యాటింగ్ ప్రారంభం

February 17, 2023

India vs Australia 2nd Test : Australia All Out By 263 Runs

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసీస్ మొదటి ఇన్నింగ్స్ మొదటిరోజే ముగిసింది. భారత్ బౌలర్లు మరోసారి విజృంభించడంతో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఖవాజా 81, హ్యాండ్స్ కాంబ్ 72* పరుగులతో రాణించారు. పాట్ కమ్మిన్స్ 33 పరుగులు చేశాడు. స్మిత్ (0), వార్నర్(15),లబుషేన్(18) విఫలమయ్యారు. హెడ్(12), అలెక్స్ క్యారీ(0) నిరాశపరిచారు. అశ్విన్ నాలుగు, షమీ, జడేజా మూడేసి వికెట్లు దక్కించుకున్నారు. మొదట ఆస్ట్రేలియాను ఖవాజా ఆదుకోగా తర్వాత హ్యాండ్స్ కాంబ్ ఇన్నింగ్స్‎ను నిలబెట్టాడు. 168 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్‌ను హ్యాండ్స్ కాంబ్-కమ్మిన్స్ జోడి ముందుకు నడిపింది. వీరిద్దరు 7వ వికెట్‌కు 59 పరుగులు జోడించి జట్టు మోస్తరు స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు.

ఆసీస్ ఇన్నింగ్స్ ముగియగానే భారత్ తన బ్యాటింగ్‎ను ప్రారంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(7), కేఎల్ రాహుల్(1) బ్యాటింగ్‎ క్రీజ్‎లో ఉన్నారు.ప్రస్తుత భారత్ 3 ఓవర్లలో 12 పరుగులు చేసింది.