ఢిల్లీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ పట్టుబిగించిది.మరో విజయం టీం ఇండియాను ఊరిస్తోంది. మరోసారి స్పిన్నర్లు జడేజా, అశ్విన్ విజృంభించడంతో కంగారులు కుదేలయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయ్యింది ఆసీస్. జడేజా 7 వికెట్లతో విజృంభించగా, అశ్విన్ 3 వికెట్లు దక్కించుకున్నాడు. 62/1 ఓవరనైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆస్ట్రేలియా కాసేపటికే హెడ్(43) వికెట్‌ను 65 పరుగల వద్ద కోల్పోయింది. తర్వాత స్మిత్‌ను అశ్విన్ వెనక్కుపంపాడు. ఇక అక్కడి నుంచి వరుసు వికెట్లను చేజార్చుకుంది.
3 బంతుల్లో 3 వికెట్లు
జడేజా, అశ్విన్ ద్వయం మూడో రోజు ఆస్ట్రేలియా కుదురుకునే అవకాశం ఇవ్వలేదు. వరుస వికెట్లను తీస్తూ ఆధిపత్యం ప్రదర్శించారు. 95 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. భారత్ స్పిన్నర్ల ధాటికి అదే స్కోర్ వద్ద మరో మూడు వికెట్లను వరుసగా సమర్పించుకుంది. అశ్విన్ వేసిన 22వ ఓవర్‌లో చివరి బంతికి పరుగుల వద్ద రెన్ షా(2) ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. తర్వాత జడేజా వేసిన 23వ ఓవర్‌లో మొదటి బంతికి హ్యాండ్స్ కాంబ్(0), కమ్మిన్స్(0) వెనుదిరిగారు. కేవలం 11 బంతుల్లో అశ్విన్, జడేజా జోడి ఒక్క రన్ ఇవ్వకుండా 4 వికెట్లు తీశారు. చివరి ముగ్గురు బ్యాటర్లను కూడా జడేజా ఔట్ చేసి ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్‌లో ఒక పరుగు ఆధిక్యంతో సహా భారత్ టార్గెట్ 115 గా ఉంది.