భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసీస్ బ్యాటర్లలో ఓపెనర్ ఖవాజా 81, హ్యాండ్స్ కాంబ్ 72* పరుగులతో సత్తా చాటారు. ఆరంభంలో వికెట్లు పడుతున్న సమయంలో ఖవాజా జట్టును నిలబెట్టాడు. మిగతా బ్యాటర్లు కంటే కొంచెం వేగంగా బ్యాట్ ఝులిపించి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. హ్యాండ్స్ కాంబ్తో కలిసి ఐదో వికెట్ కు 59 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఈ క్రమంలోనే అర్థసెంచరీ సాధించి సెంచరీ వైపు దూసుకొచ్చాడు. అత్యంత ప్రమాదకరంగా మారుతున్న ఖవాజా కేఎల్ రాహుల్ అద్భుత క్యాచ్‌కు ఔటయ్యాడు.
జడేజా వేసిన 46 ఓవర్ చివరి బంతికి ఖవాజా రివర్స్ స్వీప్ ఆడబోయి రాహుల్ చేతికి చిక్కాడు. ఈ క్యాచ్ రాహుల్ నమ్మశక్యంకాని రీతిలో అందుకున్నాడు. దూరంగా వెళ్లిపోతున్న బంతిని ఎగిరి ఒంటి చేత్తో పట్టాడు. ఈ క్యాచ్ బీసీసీఐ తన ట్విట్టర్‌లో వాటే క్యాచ్ అంటూ షేర్ చేయగా వైరల్‌గా మారింది. సూపర్ ఫీల్డింగ్ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వికెట్ తో జడేజా టెస్టుల్లో 250 వికెట్ల మైలురాయిని అందున్నాడు.
ICYMI – WHAT. A. CATCH 😯😯
WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK
— BCCI (@BCCI) February 17, 2023
ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యాక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. మొదటి రోజు ఆట నిలిచిపోయే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. రోహిత్ 13, రాహుల్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.