India vs Australia, 2nd Test Live Score
mictv telugu

6 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

February 17, 2023

ఢిల్లీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ బౌలర్లు రాణిస్తున్నారు. వరుస వికెట్లు తీసి ఆస్ట్రేలియాను దెబ్బకొట్టారు. ప్రస్తుతం 53 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు సాధించింది ఆసీస్. లంచ్ బ్రేక్ తర్వాత 94/3 స్కోరుతో ఆటను ప్రారంభించిన ఆసీస్ 108 పరుగుల వద్ద ట్రావిస్ హెడ్ (12)ను షమీ ఔట్ చేశాడు. తర్వాత ఖవాజా- హ్యాండ్స్ కాంబ్ జోడి భారత్ బౌలర్లకు ఎదురొడ్డి నిలచింది. వీరిద్దరు ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ప్రమాదకరంగా మారారు. ఈ సమయంలో ఒంటరి పోరాటం చేస్తున్న  ఉస్మాన్ ఖవాజాను (125 బంతుల్లో 81)ను జడేజా ఔట్ చేసి కంగారులను దెబ్బకొట్టాడు.తర్వాత వచ్చిన అలెక్స్ క్యారీనీ అశ్విన్ డకౌట్‎గా వెనక్కు పంపాడు. ప్రస్తుతం క్రీజ్‌లో హ్యాండ్స్ కాంబ్(33), కమ్మిన్స్(15) ఉన్నారు. అశ్విన్ 3, షమీ 2, జడేజా ఓ వికెట్ దక్కించుకున్నారు.